శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం కారణంగా జనవరి 1న స్వామివార్ల స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ఆ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండనుండడంతో భక్తులందరికీ కేవలం స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జనవరి 1న ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.