ఉప్పల్ వేదికగా RRతో జరుగుతున్న మ్యాచులో SRH బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఈ క్రమంలో జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బంతిని హెడ్ భారీ సిక్సర్ గా మలిచారు. డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన ఆ సిక్సర్ 105 మీటర్ల దూరం వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.