ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో "పీఎం మిత్ర" పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. టెక్స్టైల్ పరిశ్రమను అభివృద్ధి చేయడం, 50,000 మందికి ఉపాధి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం అని సీఎం తెలిపారు. గుజరాత్‌లోని సూరత్ మాదిరిగానే లక్నోను టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.