మహిళపై హత్యాచారం.. వ్యక్తికి జీవితఖైదు

68చూసినవారు
మహిళపై హత్యాచారం.. వ్యక్తికి జీవితఖైదు
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ మహిళపై హత్యాచారం చేసిన ఘటనలో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021లో సందీప్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఓ వితంతు మహిళను నమ్మించి అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన మొహాలీ అదనపు జిల్లా కోర్టు సందీప్ కుమార్ దోషిగా తేలడంతో శేష జీవితాన్ని జైలులోనే గడపాలని తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్