‘బ్లూఫ్లాగ్‌’ పునరుద్ధరణ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి దుర్గేష్‌

81చూసినవారు
‘బ్లూఫ్లాగ్‌’ పునరుద్ధరణ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి దుర్గేష్‌
AP: విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్‌ హర్షం వ్యక్తం చేశారు. బ్లూఫ్లాగ్‌ పునరుద్ధరణపై గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇందుకోసం కృషిచేసిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని బీచ్‌లకు సైతం బ్లూఫ్లాగ్‌ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్