సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయంపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. "నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటన దురదృష్టకరం, తీవ్ర విషాదకరం. అయితే, అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం నిరుత్సాహరిచే విషయం. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది" అని పేర్కొంటూ రష్మిక ట్వీట్ చేశారు.