అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే భక్తులకు రక్షణ కల్పించాలి: పవన్‌

63చూసినవారు
అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే భక్తులకు రక్షణ కల్పించాలి: పవన్‌
AP: అన్నమయ్య జిల్లా గుండాలకోన శివాలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం చెందడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లేవారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, పోలీసు, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్