TG: అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. 'సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది' అని KCR గుర్తు చేసుకున్నారు.