దళిత బంధు అడిగితే దళితులపై కేసులు పెడుతున్నారు: కేటీఆర్

67చూసినవారు
దళిత బంధు అడిగితే దళితులపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ నివాళులు అర్పించి మాట్లాడారు. అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు ఏదీ చేయలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు లేదు.. అంబేద్కర్ అభయ హస్తం లేదని ఎద్దేవా చేశారు. ఇదేనా అంబేద్కర్‌కు ఇచ్చే గౌరవం అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్