పుష్ప 2 మూవీలో చూపించిన గంగమ్మ జాతర.. తిరుపతిలో మేలో జరుగుతుంది. ఈ జాతరలో మగవాళ్లు అనేక వేషాలు వేసుకుంటారు. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ సమయంలో తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ అనే మహిళ వెంటాడింది. ఆమెకు భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని.. వివిధ వేషధారణలతో బయటకు రప్పించి చంపేసింది. అప్పటి నుంచి గంగమ్మను శక్తిస్వరూపంగా భావించి జాతర చేస్తారు.