ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ భాషను మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని కోయంబత్తూరు సభలో వ్యాఖ్యానించారు. కేంద్రం త్రీభాషా విధానాన్ని తీసుకురాగా.. తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళ భాషను కీర్తిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం విశేషం.