చిరుతకు చుక్కలు చూపించిన వానర సైన్యం (వీడియో)

67చూసినవారు
ఐక్యమత్యమే బలం అని నిరూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతిపై చిరుతపులి దాడి చేసింది. దాంతో అక్కడున్న వానర సైన్యం ఒక్కసారిగా చిరుతపై దాడి చేసి ఆ కోతిని కాపాడాయి. సుమారు 50 కోతులు దాడి చేయడంతో చిరుతపులి తోకముడిచి పరుగులకించుకుంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో 'దీన్నే ఐక్యత బలం అంటారు' అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్