అన్నాచెల్లెళ్లను కలిపిన ఇన్‌స్టా

70చూసినవారు
అన్నాచెల్లెళ్లను కలిపిన ఇన్‌స్టా
18 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని తన అన్నను ఇన్ స్టాగ్రామ్ కలిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా తన అన్న కనిపించాడు. వెంటనే తన అన్న గోవింద్‌తో చాటింగ్ చేసి ఇంటి రావాలని కోరడంతో ఆయన ఈ నెల 20న ఇంటికి వచ్చాడు. కాగా, గోవింద్ పని కోసం తన స్వగ్రామాన్ని వదిలి 18 ఏళ్ల క్రితం ముంబైకి వెళ్లాడు. అప్పటి నుంచి స్వగ్రామానికి వెళ్లలేదు.

ట్యాగ్స్ :