దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, శ్రీరామ నవమి రోజున ఆయన ద్వారకకు చేరుకుని, పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అనుకున్నట్లు ఆయన భార్య రాధికా మర్చంట్ తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. ఈ యాత్ర చేపట్టారు. కాగా, మార్చి 29న అనంత్ యాత్ర ప్రారంభించారు.