వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. తద్వారా ఇది చట్టంగా మారింది. ఈ బిల్లు ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. లోక్‌సభలో 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు.అయితే, బిల్లును కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.