పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో కుమారుని ఎదుటే అంగన్వాడీ కార్యకర్తను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ PS పరిధిలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. అంగన్వాడీని శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన మావోయిస్టులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుని ముందే హతమార్చారు. మృతదేహాన్ని CRPF క్యాంపుకి కిలోమీటరు దూరంలో పడేసి వెళ్లిపోయారు.