ISRO ఖాతాలో మరో ఘనత

85చూసినవారు
ISRO ఖాతాలో మరో ఘనత
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఖాతాలో మరో ఘనత చేరింది. పునర్వినియోగ ప్రయోగ వాహనం (RLV) సాంకేతికత రంగంలో ఇస్రో ప్రయోగం సక్సెస్ అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో శుక్రవారం ఉదయం RLV LEX-02 ల్యాండింగ్ ప్రయోగం ISRO చేపట్టింది. రన్‌వేపై ఖచ్చితత్వంతో ఆటోమేటిక్‌గా RLV-TD వాహనం ల్యాండ్ అయినట్లు ISRO ప్రకటించింది. దీనికి సంబంధించిన చిత్రాలను ISRO విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్