వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్

75చూసినవారు
వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ వల్ల యాప్‌లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో యాప్‌లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్‌కి మారినప్పుడు కూడా ఈ మోడ్‌లో వీడియోలను చూసే వీలుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్