హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

561చూసినవారు
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
హైదరాబాద్‌ ఎస్సార్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. హెయిర్ కట్ షాప్‌లో పనిచేసే బార్బర్ గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణ హాస్టల్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ జరిగింది. ఇద్దరు మధ్య మాట మాట పెరిగి వెంకటరమణపై కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో గణేష్ దాడి చేయడంతో స్పాట్ లోనే చనిపోయాడు. వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్