ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. "సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టలు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది" అని పోలీసులు వెల్లడించారు. అయితే, ఇంతలోనే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలుసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడని పోలీసులు తెలిపారు.