TG: కాంగ్రెస్ నాయకుడు బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కవిత.. నిన్ను, మీ కుటుంబాన్ని రాళ్లతో తరిమి కొడతారు. అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది. వీటన్నిటినీ తట్టుకోలేక, జీర్ణించుకోలేక కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు రాళ్లతో కొడుతూ రాష్ట్రం నుంచి తరుముతారు' అంటూ వ్యాఖ్యానించారు.