మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇటీవలే ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మంచు విష్ణు వెల్లడించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.