జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్

72చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్
జమ్మూ కాశ్మీర్‌లో గత మూడు రోజులుగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం దోడా జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మూడు రోజుల వ్యవధిలో ఇది నాలుగోది కాగా, దోడా జిల్లాలో ఇది రెండో ఎన్‌కౌంటర్. జూన్ 9న రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపడంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. దీని తర్వాత మంగళవారం కథువా జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్‌కౌంటర్ జరుగగా.. ఓ జవాన్ అమరుడయ్యాడు.

సంబంధిత పోస్ట్