మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై మరో హత్య కేసు

62చూసినవారు
మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై మరో హత్య కేసు
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (76)పై మరో హత్యకేసు నమోదైంది. 35 ఏళ్ల ఉపాధ్యాయుడు సెలిమ్‌ హొసేన్‌ హత్యకు సంబంధించి బొగుర సదర్‌ పోలీస్‌స్టేషనులో ఈ కేసును నమోదు చేశారు. హసీనా తన పదవికి రాజీనామా చేసేముందు జరిగిన విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న హొసేన్‌పై అవామీలీగ్‌ నేతలు, కార్యకర్తలు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు అభియోగం. హసీనా ఆదేశాలతోనే ఈ దాడి జరిగినట్లు మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్