AP: డిసెంబర్ 18, 19 తేదీల్లో మరో తుఫాను వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయా తేదీల్లో తుఫాను గురించి ముందుగా హెచ్చరికలు జారీ చేస్తామని అంటున్నారు. వ్యవసాయ పనులు ఏమైనా ఉంటే నాలుగైదు రోజుల్లో చూసుకోవాలన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 13 గంటల్లో బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపారు.