భారత్‌లోని రాష్ట్రాల్లో బిహేవియర్, సెక్యురీటి, డైవర్సిటీ, లింగ వివక్షత వంటి సామాజిక సూచికలను పరిగణలోకి తీసుకొని గ్రాస్ GDB సూచీ సర్వే విడుదలైంది. మొత్తం 21 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ స్థూల దేశీయ ప్రవర్తన సర్వేలో కేరళ స్టేట్ ముందంజలో ఉంది. తరువాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణకు 8, ఆంధ్రప్రదేశ్‌కు 11వ స్థానం దక్కింది.