కొబ్బరి నీళ్లు తాగితే శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో కాల్షియం, మాంగనీస్ వంటి అనేక ఇతర పోషకాలు ఉంటాయి. అయితే కొంతమంది దీనిని ఖాళీ కడుపుతో, మరికొందరు పగటిపూట ఎండ సమయంలో తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు ఉదయం వేళలో తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత తాగకూడదని సూచిస్తున్నారు. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీటిని తాగాలని చెబుతున్నారు.