వేయించిన శనగలు తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా మనం తినే ఆహారం తగ్గుతుంది. శనగల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇవి ఎముకలను బలపరచడానికి, ఆస్టియోపోరోసిస్ వ్యాధిని నిరోధించడానికి సహాయపడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.