AP: రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూటమి సర్కార్ శుక్రవారం ప్రవేశ పెట్టనుంది. రేపు ఉదయం 9 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుంది. మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలువుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కౌన్సిల్‌లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.