పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. పెరిగిన పోలింగ్ శాతం

77చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. పెరిగిన పోలింగ్ శాతం
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రులు ఓట్లు వేసేందుకు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా 69.57 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఇక్కడ 10 శాతం పోలింగ్‌ పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే.. ఏలూరులో 73.30శాతం, కృష్ణాలో 69.91శాతం, ఎన్టీఆర్‌లో 65.69 శాతం, గుంటూరులో 66.45 శాతం, బాపట్లలో 74.30 శాతం, పల్నాడులో 77.33 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్