ఏపీలోని అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టెలా కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నివాసయోగ్య ధ్రువపత్రం ఇస్తేనే తాగునీరు, డైనేజీ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్సులు జారీ చేయొద్దని, నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేసింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలని సూచించింది.