ముంబై టెకీ నిషాంత్ త్రిపాఠి సహారా హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య అపూర్వ, అస్తి ప్రార్ధనే కారణమని పేర్కొన్నారు. తను పనిచేసే కంపెనీ సైట్‌లో సూసైడ్ నోట్ అప్‌లోడ్ చేశారు. 'అపూర్వా.. సువ్విది చదివే సరికి నేనుండను. నా చివరి క్షణాల్లో నిన్ను అసహ్యించుకోగలను. కానీ అలా చేయను. ఐ లవ్ యూ' అని నోట్‌లో పేర్కొన్నారు. అయితే చావడానికి ముందు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ గదికి బోర్డు పెట్టడంతో విషయం ఆలస్యంగా బయటకొచ్చింది.