తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. భక్తులు రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. కర్పూరం వెలిగించడం, హారతులు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాల వలన ఒక్కొ సారి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, రైళ్లలో ఇలాంటివి చేయొద్దని ప్రయాణికులక విన్నవించింది.