బీజేపీ నాయకుణ్ని కాపాడిన యాపిల్ వాచ్

59చూసినవారు
బీజేపీ నాయకుణ్ని కాపాడిన యాపిల్ వాచ్
యాపిల్ వాచ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించింది. ఇటీవల ఆయనకు కొంతదూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో మంట వస్తున్నా చిన్నపాటి నిర్లక్షం చేశారు. అయితే ఆయన ధరించిన యాపిల్ వాచ్ గుండెకు ఇబ్బంది ఉందని పసిగట్టి అలర్ట్ ఇచ్చింది. ఆయన వైద్యుల్ని సంప్రదించగా హార్ట్ లో 2 రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం రామకృష్ణ హైదరాబాద్ వెళ్లారు.

సంబంధిత పోస్ట్