తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఎప్పుడు ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు దినేష్ తేజ్, దష్విక హీరో, హీరోయిన్లుగా నటించిన తత్వం మూవీ విడుదలకు సిద్దమైంది. కాగా ఈ మూవీకి అర్జున్ కోల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేసింది. ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.