వ్యసనాలకు బానిసైన దొంగలు పట్టపగలే చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా పంజాబ్‌లో అలాంటి ఘటనే జరిగింది. పట్టపగలే మహిళ మెడలో నుంచి బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా ఇద్దరు దుండగులు అడ్డుగా వచ్చారు. దీంతో వారు స్కూటీని ఆపగా వెంటనే వెనుక కూర్చొన్న మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కొని పారిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.