ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై కేటీఆర్
ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 8 మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమేనని ఆరోపించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తీరుందని ఆరోపించారు.