లవ్ టుడే' మూవీతో తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారిపోయాడు. తాజాగా ప్రదీప్ హీరోగా నటించిన మరో మూవీ డ్రాగన్. ఈ మూవీకి మారిముత్తు డైరెక్షన్ వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే తాజాగా ఈ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రశంసలు కురిపించారు. 'డ్రాగన్ ఓ మంచి కథా.. చిత్రించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్ అశ్వత్ మారిముత్తు' అంటూ చెప్పారు.