కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట మూవీతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం కార్తీ సర్దార్ మూవీలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్‌తో 'రాజా సాబ్' లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 'బాహుబలి నుంచి ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్‌ని, ఆయనతో కలిసి నటించాలని కలలు కన్నా. రాజా సాబ్‌తో ఆ కల నెరవేరింది' అని తెలిపారు.