పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను భారతదేశంలోని అర్జెంటీనా రాయబారి మరియానో కౌసినో సందర్శించారు. ఉరుగ్వే రాయబారి అల్బెర్టో గ్వానీతో కలిసి మంగళవారం ఉదయం సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం వారు మాట్లాడుతూ.. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.