దారుణం.. రోడ్డుపై పనిచేస్తున్న మహిళను ఢీకొట్టి వెళ్లిపోయిన కారు (వీడియో)

59చూసినవారు
వరంగల్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హనుమకొండ- అంబేద్కర్ సర్కిల్ నుంచి ఓల్డ్ బస్ డిపో వెళ్లే రోడ్డులో పీహెచ్ వర్కర్ రామంచ సమ్మక్క రోడ్డుపై పనిచేస్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమ్మక్కకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం సమ్మక్కను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్