కూరగాయలు అమ్ముతున్న ముస్లిం యువకుడిపై దాడి.. వీడియో

81చూసినవారు
రాజస్థాన్ లోని జైపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయలు అమ్ముతున్న ముస్లిం యువకుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ మేరకు అన్షుల్ దధీచ్ అనే యువకుడు.. ముస్లిం అనే కారణంగా ఓ కూరగాయల వ్యాపారిని దుర్భాషలాడి కొట్టాడు. బంగ్లాదేశీ ముస్లిం అంటూ పలుమార్లు దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ దాడికి పాల్పడిన అన్షుల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్