శరణార్థి శిబిరాలపై దాడి.. 25 మంది మృతి

56చూసినవారు
శరణార్థి శిబిరాలపై దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు. ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ.. 25 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్