బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులపై దాడులు తీవ్రం కావడంతో నటుడు సోనూ సూద్ కీలక ప్రకటన చేశారు. 'బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ ఇండియాకు రప్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వారికి మంచి లైఫ్ దొరుకుతుంది. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు. మనందరిదీ. జై హింద్' అని ట్వీట్ చేశారు. బంగ్లాలో ఓ హిందూ మహిళ ఆవేదనను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా సోనూ పై విధంగా స్పందించారు.