యాద్రాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌పై యువజన కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ… రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ఈ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ విద్వేషం, హింసను ప్రేరేపించే సంస్కృతికి ఇదొక నిదర్శనం అని తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.