మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. భాగమతి సినిమాలో అనుష్కకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన మార్కో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయంపై ముకుందన్ స్పందిస్తూ.. సినిమాకు విశేష ఆదరణ లభించిందని, ఇలాంటి విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.