ఉత్తమ అధికారిగా అవార్డు.. ఇంటికెళ్లగానే మృతి

550చూసినవారు
ఉత్తమ అధికారిగా అవార్డు.. ఇంటికెళ్లగానే మృతి
ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్న ఓ వ్యక్తి గంటలోనే మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. దివ్యాంగుడు దివాకర్(56) ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీసులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. నిన్న రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇంటికి వెళ్లగానే గుండె పోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పలువురిని కలచివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్