తిరుమలలో ఈ నెల 6న అయోధ్య కాండ అఖండ పారాయణం

66చూసినవారు
తిరుమలలో ఈ నెల 6న అయోధ్య కాండ అఖండ పారాయణం
తిరుమలలో నాదనీరాజనం వేదికపై ఈ నెల 6న 10విడత అయోధ్య కాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పారాయణం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయోధ్యకాండలోని 35 నుండి 39వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 164 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 189 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమంలో TTD వేదపండితులు, TTD సంభావన పండితులు పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్