కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిజోరాం పర్యటనలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏడేళ్ల ఎస్తేర్ లాల్దుహోమి హ్మమ్తే వందేమాతరం గీతాన్ని చాలా అద్భుతంగా పాడింది. ఆమె గొంతుకు అంతా ఫిదా అయ్యారు. అమిత్ షా సైతం మెచ్చుకుని, ఆమెకు గిటారు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని షా ఎక్స్‌లో పంచుకున్నారు. ఆమె పాట వీడియో, బహుమతి ఫొటోలతో పాటు దేశభక్తి ఏకం చేస్తుందని అందులో రాసుకొచ్చారు.