రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ రానుంది. ఇందులో రామ్ చరణ్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారట. అందుకోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్‌ను మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఆటకూలీగా కనిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆటకూలీ అంటే కొంతమంది ఆటగాళ్లు గ్రూప్‌గా ఉంటూ.. ప్రతిభగల ఆటగాళ్లను టీంగా తయారు చేస్తుంటారు. వారికి రోజు కూలీ చెల్లిస్తుంటారు.